ఛత్తీస్ గఢ్ బీజాపూర్- దంతెవాడ సరిహద్దుల్లోని అండ్రీ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22 మంది మావోలు మరణించారు. ఎదురుకాల్పుల్లో ఒక జవాను చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో పలుమార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.
భారీ ఎన్కౌంటర్.. 22మంది మావోయిస్టుల మృతి
22
Mar