మధ్య ప్రదేశ్ ఛతర్పూర్లోని జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన జరిగింది. తన భార్యకు త్వరగా వైద్యం అందించాలని కోరిన ఉధవ్లల్ జోషి(77) అనే వృద్ధుడిపై డాక్టర్ రాజేశ్ దురుసుగా ప్రవర్తించాడు. అతని చెంప మీద కొట్టడమే కాకుండా బయటికి ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో వైరలవడంతో అధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాక వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వృద్ధుడిని కొట్టి ఈడ్చుకెళ్లిన డాక్టర్
23
Apr