పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వినయ్ నర్వాల్ కుటుంబానికి హరియాణా ప్రభుత్వం అండగా నిలిచింది.
నర్వాల్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం నయబ్ సింగ్ సైనీ ప్రకటించారు. నేవీలో లెఫ్టినెంట్గా ఉన్న నర్వాల్ పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లగా ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో మరణించారు.