ఇన్స్టా రీల్స్ పిచ్చిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన UPలోని నగ్లాస్వామి గ్రామంలో చోటుచేసుకుంది. యమునా నదిలో రీల్స్ తీసుకోవడానికి ఆరుగురు అమ్మాయిలు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఓ యువతి మునిగిపోతుండగా మిగతా వాళ్లు రక్షించడానికి ప్రయత్నించి కొట్టుకుపోయారు.
పోలీసులు గాలించగా నాలుగు బాడీలు దొరికాయి. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.