AP: మచిలీపట్నం మాజీ ఎంపీ, చల్లపల్లి జమిందారు తనయుడు యార్లగడ్డ అంకినీడు ప్రసాద్(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కోయంబత్తూరులోని స్వగృహంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1967లో బందర్ ఎంపీగా ఎన్నికైన ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారు. అభిమానుల సందర్శనార్థం రేపు చల్లపల్లికి భౌతికకాయం తరలించనున్నారు. ఆయన మృతితో చల్లపల్లిలో విషాదం నెలకొంది.
మాజీ ఎంపీ కన్నుమూత
07
Jun