దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదయ్యాయి.
అత్యధికంగా కర్ణాటక-136, గుజరాత్-129, కేరళలో 96 మందికి పాజిటివ్ తేలింది. కేంద్ర ఆరోగ్యశాఖ డేటా ప్రకారం దేశంలో 6,815 యాక్టివ్ కేసులు ఉండగా.. కేరళలో అత్యధికంగా 2,053, గుజరాత్లో 1,109, ఢిల్లీలో 691, మహారాష్ట్రలో 613 కేసులు ఉన్నాయి. APలో 86, TGలో 10 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ముగ్గురు చనిపోయారు.