కృష్ణా బేసిన్లో వర్షాల కారణంగా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. జూరాలకు ఇన్ ఫ్లో 1,06,000 క్యూసెక్కులు వస్తుండగా 1,03,729 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలానికి 1,01,459 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దిగువకు నీటిని వదలడం లేదు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 864.30 అడుగులుగా ఉంది.
జూరాల, శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
28
Jun