AP: అనకాపల్లి(D) పాయకరావుపేట బాలికల గురుకులాన్ని సందర్శించిన హోంమంత్రి అనితకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆకస్మిక పర్యటనకొచ్చిన ఆమె విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తుండగా, ఆహారం అపరిశుభ్రంగా ఉంది. దీంతో ఇది తనకు పెట్టిన భోజనమేనా అని, రోజూ ఇలానే ఆహారం వడ్డిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా, అన్ని గురుకులాల్లోనూ ఇలానే తనిఖీ చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అపరిశుభ్ర భోజనం.. హోంమంత్రి ఆగ్రహం
02
Jul