తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చెమ్మనుప్పం వద్ద పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. రైలు వచ్చే సమయానికి గేటు వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రైలు ఢీకొనడంతో బస్సు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడి నుజ్జునుజ్జయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు
09
Jul