TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో ప్రమాదానికి నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని NDMA బృందం తేల్చింది. ఇవాళ ఘటనా స్థలంలో పరిశీలన చేపట్టిన బృంద సభ్యులు పేలుడుకు గల కారణాలపై అధ్య యనం చేశారు. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 44 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఘటన జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.