TG: రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను CM రేవంత్ ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలకు SDRF, NDRF సిబ్బంది ముందుగానే వెళ్తే వారితో కలెక్టర్లు సమన్వయం చేసుకుంటారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున వైద్యారోగ్య శాఖ అప్రమత్తం కావాలని ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షసూచన.. మరింత అప్రమత్తంగా ఉండాలి: CM రేవంత్
17
Aug