AP: భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 91.7% పూర్తైనట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ‘గడువుకు ముందే పనులను పూర్తి చేయాలని నిశ్చయంతో ఉన్నాం.
DEC ఆఖరు లేదా JAN తొలి వారంలో టెస్ట్ ఫ్లెట్ ఎగరనుంది. ఏవియేషన్ వర్సిటీ, ఇండిగో హబ్ ఏర్పాటుకు యత్నిస్తున్నాం. భోగాపురంలో స్కిల్ వర్సిటీలు నిర్మిస్తాం’ అని తెలిపారు. అంతకుముందు విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు జీఎంఆర్ ప్రతినిధులు పనుల పురోగతిని వివరించారు.