దుబాయ్ లో ఈనెల 7న జరిగే ICC మీటింగ్లో ACC అధ్యక్షుడు నఖ్వీపై తాడోపేడో తేల్చుకోవాలని BCCI నిర్ణయించుకుంది. ఆసియాకప్ విజేత ఇండియా టీమ్కు ట్రోఫీ అప్పగించకపోవడంపై నిలదీయనుంది. నఖ్వీపై పలు అభియోగాలనూ సిద్ధం చేసింది. పాక్ మంత్రిగా ఉన్న ఆయన ACC పదవికి అనర్హుడని, తప్పించాలని వాదించనుంది. దీనికి AFG బోర్డూ మద్దతు తెలిపే అవకాశముంది. కాగా ఈ భేటీకి నఖ్వీ గైర్హాజరు కావచ్చని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
నఖ్వీపై తాడోపేడో తేల్చుకొనే పనిలో BCCI
08
Nov