AP: ఆర్టీసీ ప్రైవేటీకరణ, డీజిల్ ధరలకు అనుగుణంగా టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఖండించారు. ‘ఆర్టీసీ ఆర్థికంగా బలంగా ఉంది. సంస్థకు రూ.25-30వేల కోట్ల ఆస్తులున్నాయి. టికెట్ ధరలను పెంచే ఆలోచనే లేదు. ప్రైవేటీకరణ కూడా జరగదు. త్వరలోనే 2,500 ఈవీ, 500 CNG బస్సులు రాబోతున్నాయి. అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అని వెల్లడించారు.
ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచే ఆలోచన లేదు: మంత్రి
30
May