AP: కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు తెలుగు తమ్ముళ్లు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకోవడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలిరావడంతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. పలుచోట్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
కిక్కిరిసిన ప్రమాణ స్వీకార ప్రాంగణం
12
Jun