AP: పులివెందుల పర్యటన ముగించుకుని మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లారు. తన భార్య భారతి కూడా ఆయన వెంట ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా జగన్‌కు యెలహంకలో 23 ఎకరాల్లో ప్యాలెస్ ఉన్నట్లు టాక్. ఇది కట్టి దశాబ్దం దాటినా జగన్ పట్టుమని పది రోజులు కూడా ఇందులో ఉండలేదు. అప్పట్లో షర్మిల ఉండేవారని సమాచారం. ఇప్పుడు జగన్ మళ్లీ ఈ ప్యాలెస్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది.
బెంగళూరు వెళ్లిన వైఎస్ జగన్
25
Jun