భారతీయ న్యాయ సంహితలోనూ పోలీస్ రిమాండ్ 15 రోజులే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘పాత చట్టాల్లో తొలి 15రోజుల్లోనే రిమాండ్ విధించే అవకాశం ఉంది. కానీ అప్పుడు నిందితుడు ఆస్పత్రిలో చేరితే ఆ గడువు ముగిసి ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. అందుకే తొలి 60రోజుల్లో రిమాండ్ ఎప్పుడైనా 15రోజులు విధించగలిగేలా మార్పులు చేశాం. దీనిపై దుష్ప్రచారం చేయకండి’ అని పేర్కొన్నారు.
పోలీస్ కస్టడీపై అందుకే చట్టంలో మార్పులు చేశాం: అమిత్ షా
01
Jul