ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు దుర్మరణం చెందారు. హిమాలయన్ టెంపుల్ నుంచి బైక్పై తిరిగి వెళ్తుండగా వారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. మృతులు నిర్మల్ షాహి (36), సత్య నారాయణ (50)లుగా గుర్తించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు బైక్లపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
ఉత్తరాఖండ్లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు HYD బైకర్లు మృతి
07
Jul