HYDలో షాకింగ్ ఘటన జరిగింది. విద్యానగర్ బస్ స్టాప్ సమీపంలో RTC బస్సు యూటర్న్ తీసుకుంటుండగా ఆపాలంటూ వృద్ధురాలు బీర్ బాటిల్ విసిరింది. దీంతో మహిళా కండక్టర్ దిగి ఆమెను పట్టుకొని ప్రశ్నించింది. పొంతనలేని సమాధానం చెప్పడంతో వృద్ధురాలి చేతులు కట్టేసింది. ఈక్రమంలోనే ఆమె సంచిలో నుంచి పామును తీసి కండక్టర్పై విసిరేసింది. అయితే ఆమె పాములు ఎక్కడి నుంచి తీసుకువచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మహిళా కండక్టర్పై పాము విసిరేసింది
09
Aug