AP: ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకున్న కి’లేడీ’ ఉదంతం తిరుపతిలో వెలుగు చూసింది. ఆమె చేతిలో మోసపోయిన ఓటేరుకు చెందిన ఆరో భర్త తేజ తన గోడువెల్లబోసుకున్నాడు. ఆమె ఇప్పటికే నాగమణి, శిరీష, సల్మా, సుజి పేర్లతో పలువురిని దగా చేసిందని చెప్పాడు. తన వద్ద నుంచి రూ.లక్షల నగదు, 40 గ్రాముల బంగారంతో ఉడాయించిందని వాపోయాడు. సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు.
ఏడుగురిని పెళ్లాడి మోసం చేసిన కి’లేడీ’
31
Aug