హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

సూర్యాపేట (D) కోదాడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. NTR(D) నందిగామ వద్ద వాగు పొంగి వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహన రాకపోకలు నిలిచాయి. దీంతో విజయవాడ వెళ్లే వాహనాలను ఖమ్మం, నార్కట్పల్లి-అద్దంకి హైవేపైకి మళ్లించారు. అటు విజయవాడ-హైదరాబాద్ రహదారిపై జగ్గయ్యపేట వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సూర్యాపేట-విజయవాడ మధ్య ప్రయాణాలు చేసే వారు వాయిదా వేసుకుంటే మంచిది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *