TG: సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు కాల్వ ఒడ్డు ప్రాంతంలో ఆందోళనకు దిగారు. బాధితులకు మద్దతిచ్చిన బీఆర్ఎస్ నేతలు ‘CM డౌన్ డౌన్’ అంటూ నిరసన తెలిపారు. భారీ వర్షాలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు.
సీఎం పర్యటనలో ఉద్రిక్తత.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు
03
Sep