ఆ షూటింగ్ మధ్యలోనే వదిలేసి వచ్చారు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యినటువంటి గ్రాండ్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్ అని చెప్పడంలో సందేహం లేదు.అయితే మన సౌత్ భాషల్లో కొన్నేళ్ల కితం స్టార్ట్ అయినప్పటికీ అంతకు ముందు నుంచే హిందీ మార్కెట్ లో బిగ్ బాస్ ఆల్రెడీ పాగా వేసింది. ఇలా హిందీలో మొదటి నుంచి పాపులర్ గా మారిన ఈ గ్రాండ్ షోకి బాలీవుడ్ మెగాస్టార్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా మారిన తర్వాత నుంచి ఈ షోకి మరింత కిక్ వచ్చి హిట్ అయ్యింది. సల్మాన్ ఖాన్ హిందీలో బిగ్ బాస్ సీజన్ 4 నుంచి హోస్టింగ్ స్టార్ట్ చేసాడు.
అలాగే ఆ నాల్గవ సీజన్ నుంచి ఇప్పుడు వరకు మొత్తం 18వ సీజన్ వరకు తానే తీసుకొచ్చి సక్సెస్ ఫుల్ రియాలిటీ షోగా తీసుకెళ్తున్నాడు. కాగా జస్ట్ కొన్ని రోజులు కితమే హిందీలో 18వ సీజన్ ని మేకర్స్ స్టార్ట్ చేశారు. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటీనటులు హౌస్ లోకి వెళ్లారు. అంతే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు కూడా హిందీ బిగ్ బాస్ లోకి వెళ్ళింది అని వార్తలు కూడా వచ్చాయి.
మరి ఇలా ఒక ఫ్లో లో షూటింగ్ కి వెళ్ళిపోతున్న ఈ సీజన్ మధ్యలో ఒక ఊహించని షాక్ తగిలింది. సల్మాన్ ఖాన్ పై లేటెస్ట్ గా ఓ ఎపిసోడ్ ని షూట్ చేస్తుండగా షూటింగ్ మధ్యలోనే ఆపేసి హుటాహుటిన సల్మాన్ వెళ్ళిపోయిన వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా ఇందుకు సల్మాన్ దగ్గర విషాద కారణమే ఉందట.తనకి ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ అయినటువంటి బాబా సిద్ధిఖిని ముంబై, బాంద్రాలో ఎవరో కాల్చి చంపేశారని