నారా రోహిత్ సిరి లెళ్ళు ఎంగేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు మరియు ఆయన సతీమణి

తాజాగా ఎంగేజ్మెంట్ బంధంతో ఒక్కటైన సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరి ఎంగేజ్మెంట్ కి ఏపీ సీఎం చంద్రబాబు భువనేశ్వరి కలిసివచ్చి ఈ జంటను ఆశీర్వదించారు.ఇక వీరి పెళ్లి డిసెంబర్లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది అయితే దాదాపు 40 ఏళ్లు వచ్చినా నారా రోహిత్ ఇన్ని రోజులుగా పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ నీ మెయింటైన్ చేసి తాజాగా సిరి లేళ్లని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

అయితే నారా రోహిత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కంటే దాదాపు 12 ఏళ్లు పెద్ద అయినా కూడా వీరిద్దరి మనసులు కలవడంతో పెళ్లికి రెడీ అయిపోయారు.. అయితే నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ బ్యాగ్రౌండ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. మరి ఇంతకీ సిరిలేళ్ల బ్యాగ్రౌండ్ ఏంటి..ఆమె ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.. నారా రోహిత్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరో కాదు పల్నాడు డిస్టిక్ లోని మాచర్ల నియోజకవర్గం రెంటచింతల గ్రామానికి చెందిన అమ్మాయి శిరీష తల్లిదండ్రులు ఒక సామాన్య రైతులు.. శిరీష తండ్రి నాగేశ్వరరావు ఎన్నో కష్టాలు పడి తన నలుగురు కూతుర్లని పెద్ద చదువులు చదివించారు. ఇక శిరీష సినిమాల్లోకి వచ్చాక సిరి గా పేరు మార్చుకుంది. సిరి లేళ్ళ కి ముగ్గురు అక్కలు పెద్దక్క శ్రీలక్ష్మి సొంత గ్రామంలోనే అంగన్వాడీ సూపర్వైజర్ గా పనిచేస్తుంది. ఇక రెండో అక్క భవాని పెళ్లయ్యాక యుఎస్ కి వెళ్లి అక్కడే స్థిరపడింది.అలాగే మూడో సోదరి ప్రియాంక పెళ్లి చేసుకొని హైదరాబాదులో సెటిల్ అయింది.

ఇక హైదరాబాదులో ఉంటున్న మూడో అక్క దగ్గరే సిరిలేళ్ల ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసింది. అలా అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలోనే జర్నలిస్టు మూర్తి తెరకెక్కించిన ప్రతినిధి టు మూవీలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది.ఇక ఆస్ట్రేలియాలో చదువులు కంప్లీట్ చేసి అక్కడే కొన్ని రోజులు జాబ్ చేసిన ఈ ముద్దుగుమ్మ మూవీస్ పై ఇంట్రెస్ట్ తో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఒక్కటే మూవీలో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా నారా వారి ఇంటికి కోడలుగా వెళ్ళబోతుంది. వీరి ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాదులో కుటుంబసభ్యుల మధ్యలో ఘనంగా జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *