ప వన్ కల్యాణో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు.అయితే ఇటీవల రేణు దేశాయ్ ఇద్దరి పిల్లలు పవన్
అయితే ఇటీవల రేణు దేశాయ్ ఇద్దరి పిల్లలు పవన్ కల్యాణ్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలో రేణు దేశాయ్ కొడుకు, కూతురు పవన్ కల్యాణ్ దర్శనం ఇస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ తిరుమల వెళ్లిన సమయంలో కూడా రేణు దేశాయ్ కూతురు ఆయనతో కనిపించింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సామాజిక సమస్యలపై తనదైనశైలిలో స్పందిస్తుంటారు. ఇదే సమయంలో తనపై పవన్ ఫ్యాన్స్ ఎవరైనా కామెంట్స్ చేస్తే వారికి ధీటుగానే కౌంటరిస్తుంటారు. పేద పిల్లల చదువు,ఆరోగ్యం, మూగ జీవాలు కోసం సోషల్ మీడియాలో ఆమె ఫండింగ్ కలెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న తప్పులపై తనదైనశైలిలో స్పందిస్తుంటారు. ఇక పవన్‌తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ తర్వాత తిరిగి సినిమాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్నారు.
దీనిలో భాగంగానే గతేడాది రవితేజ నటించిన టైగర్ దీనిలో భాగంగానే గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ నిలిచింది. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాలో రేణు దేశాయ్ నటించలేదు. అయితే తాజాగా ఆమె తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. ఆమె మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. “షూటింగ్లో పాల్గొనడం కోసం. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నాను” అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేశారామె. అయితే తాను ఎవరి సినిమాలో నటిస్తుందో మాత్రం వెల్లడించలేదు. మొత్తానికి ఏడాది తర్వాత రేణు దేశాయ్ తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధం కావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.