TG: ఐటీఐ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. వివిధ ట్రేడ్లలో చేరేందుకు 8, 10వ తరగతి పాసై, 1-8-2024 నాటికి 14 ఏళ్లు నిండిన విద్యార్థులు అర్హులని చెప్పారు. గత కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి వివరాల కోసం https://iti.telangana.gov.in/3 సంప్రదించాలని సూచించారు.
ITI ప్రవేశాలకు గడువు పొడిగింపు
19
Oct