ఎక్కడపడితే అక్కడ రీల్స్, షార్ట్స్ తీస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆగ్రాలో ఆసిఫ్ (20) అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి స్లో మోషన్లో రీల్స్ చేస్తూ నాలుగో అంతస్తు నుంచి పడి చనిపోయాడు. బిల్డింగ్ మధ్యలో సేఫ్టీ రెయిలింగ్‌ను తీసేసి పొరపాటున అడుగుపెట్టగానే అతను గ్రౌండ్ ఫ్లోర్లో పడటంతో తల, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
స్లో మోషన్లో రీల్ చేస్తూ కిందపడి యువకుడి మృతి
20
Oct