TG: ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1
పరీక్షలకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేస్తుండటంతో TGPSC సూచనలతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో ఎగ్జామ్ సెంటర్ వద్ద SI ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. మ.12.30 గంటల నుంచి 1.30 వరకు అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారు. మ.2 నుంచి సా.5 వరకు పరీక్షలు జరుగుతాయి.