AP: వైఎస్సార్ జిల్లాలో ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని హోంమంత్రి అనిత చెప్పారు. విద్యార్థినిపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయన్నారు. నిందితుడు విఘ్నేశ్, అతనికి సహకరించిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పెట్రోల్ దాడిలో బాలిక మరణం కలచివేసింది: అనిత
21
Oct