TG: పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు సచివాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆందోళనకారులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని బీఆర్కే భవన్ వద్ద అడ్డుకున్నారు. ఈక్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఠాణాలకు తరలించారు.
సచివాలయం ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత
27
Oct