AP: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే గడువు తేదీని పొడిగించారు. మార్చిలో ఫస్ట్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 21 వరకు ఎటువంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. రూ.1,000 ఫైన్‌తో డిసెంబర్ 5 వరకు ఫీజు కట్టొచ్చన్నారు. తొలుత అక్టోబరు 21 నుంచి నవంబర్ 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. మరోసారి గడువు పెంచే ఆస్కారం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పెంపు
13
Nov