తమిళనాడులోని తిరుచ్చిలో విచిత్ర ఘటన జరిగింది. రెండు రోజుల కిందట చిన్నమ్మాళ్ (62) అనే వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయారని బంధువులు భావించారు. పల్స్ కూడా లేకపోవడంతో శ్మశానంలో దహన సంస్కారాలకు సిద్ధం చేయగా చితిలో నుంచి ఆమె మంచినీళ్లు అడగటంతో అందరూ షాకయ్యారు. పలువురు భయంతో పరుగులు పెట్టారు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చితిలో నుంచి మంచి నీళ్లు అడిగింది
23
Nov