15 నెలల పాప కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతుండగా ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ ప్రత్యేక చొరవతో ఆ పాపని యూరాలజీ విభాగంలో భర్తీ చేశారు. ఈ మేరకు యూరాలజీ వైద్యుడు కార్తీక్ ఆధ్వర్యంలో అనస్తీషియా వైద్య సిబ్బంది శరీరంపైన ఎలాంటి కోతలు లేకుండానే ఆ కిడ్నీ స్టోన్‌ను లేజర్ టెక్నాలజీతో తొలగించారు. సోమవారం పాపను డిశ్చార్జ్ చేశారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిన సిబ్బందిని డైరెక్టర్ అభినందించారు.
15 నెలల పాపకు కిడ్నీ స్టోన్స్‌ను తొలగించిన ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు
26
Nov