TG: రెండు పిల్లర్ల మధ్య బాలిక తల ఇరుక్కుపోయిన ఘటన నాగర్ కర్నూలు(D) అచ్చంపేట(M)లో జరిగింది. పులిజాల గ్రామంలోని ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తల పెట్టింది. అందులో తల ఇరుక్కుపోవడంతో కేకలు వేసింది. ఇది గమనించిన టీచర్లు.. గ్రామస్థుల సాయంతో పిల్లర్లను చిన్న ముక్కలుగా తొలగిస్తూ బాలిక తలను సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పిల్లర్ల మధ్య ఇరుక్కున్న బాలిక తల
08
Dec