చంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కాస్త ఆలస్యం కానుంది. న్యాయమూర్తి ఆదేశాల కాపీ సైట్లో అప్లోడ్ అయిన తర్వాత వాటిని జైలర్ వెరిఫై చేసుకుని ఖైదీలను రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం తీర్పు కాపీ ప్రిపరేషన్లో ఉందని సమాచారం. దీంతో బన్నీ బయటకు వచ్చేందుకు మరో అరగంటకు పైగా సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
కాగా బన్నీకి స్వాగతం పలికేందుకు జైలు బయట భారీగా ఫ్యాన్స్, ఇంటి వద్ద కుటుంబీకులు వేచి చూస్తున్నారు