వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజును తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు. అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలవడంతో ఆయనకు రూ.5 కోట్లతో ప్రభుత్వం సత్కరిస్తుందని స్టాలిన్ ట్వీట్ చేశారు. ‘మీ విశేషమైన విజయం భారతదేశ చెస్ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. దీంతో చెన్నై ప్రపంచ చెస్ క్యాపిటల్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తమిళనాడు మిమ్మల్ని చూసి గర్విస్తోంది’ అని పేర్కొన్నారు.
గుకేశు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్
14
Dec