రామ్ చరణ్ వీరాభిమాని సూసైడ్ లెటర్ రాయడం కలకలం రేపింది. త్వరలో గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు. ‘సినిమాకు ఇంకా 13రోజులే ఉంది. అభిమానుల ఎమోషన్స్‌ను పట్టించుకోవడం లేదు. ఈనెలాఖరు లేదా JAN 1 వరకు రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్య కు పాల్పడతాను’ అని రాసుకొచ్చాడు. కాగా దీనిపై స్పందించిన మేకర్స్ ప్రోగ్రామ్స్ ప్లాన్ ప్రకారం జరుగుతాయని చెప్పినట్లు సమాచారం.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా: అభిమాని
29
Dec