ఆ రోజు నుంచి నా టైమ్ను 8 నిమిషాలు ముందుకు జరిపా:
16 ఏళ్ల వయసులో 1989లో తొలిసారి వెళ్లిన పాకిస్థాన్ టూర్ తనకు ఎంతో నేర్పిందని సచిన్ చెప్పారు. BCCI అవార్డుల వేడుకలో మాట్లాడుతూ ‘ప్రాక్టీస్ కోసం రోజూ ఉ.9 గంటలకు హోటల్ నుంచి బస్సు వెళ్లేది. ఓ రోజు నేను ఆలస్యమవడంతో కపిల్ దేవ్ నన్ను పిలిచి ఇప్పుడు 9 అయిందా? అని అడిగారు. అప్పటి నుంచి నా వాచ్ టైమ్ను 7,8 నిమిషాలు ముందుకు జరిపా. ఆ పర్యటనతో నేనెంతో నేర్చుకున్నా’ అని పేర్కొన్నారు.