బిహార్లోని సమస్తిపూర్కు చెందిన ఓ గర్భిణి సహర్సాకు వెళ్తుండగా రైలులోనే పురిటి నొప్పులొచ్చాయి. దీంతో కోచ్ లోని ఇతర మహిళలతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రసవానికి సహాయం చేశారు. దీంతో సదరు మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ట్రైన్ను నిలిపేసి ఆమెను ఆస్పత్రికి తరలించగా తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది
ట్రైన్లో ప్రసవం.. పండంటి ఆడబిడ్డ జననం
08
Feb