TG: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఈ నెల 10న NLG అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కక్షతో మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్య చేయించాడని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.
78 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, ఎనిమిది మంది నిందితులపై ఛార్జ్ షీటు దాఖలు చేశారు. A1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా, తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.