M
ఓ ఫొటోగ్రాఫర్ చెవి దుద్దులు బాగున్నాయన్నందుకు బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఏకంగా దాన్ని అతడికి బహుమతిగా ఇచ్చింది. తన కూతురు రాషా తడానీతో కలిసి ఆమె ముంబై ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తున్నారు. ఇంతలో వారిలో ఒకరు మీ చెవిదిద్దులు బాగున్నాయని పొగిడాడు. దీంతో ఏ కమ్మ బాగుందని అడుగుతూ దాన్ని తీసి అతడికి ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.