నిద్రమాత్రల వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రి పాలైన సింగర్ కల్పన తనకు, తన భర్తకు మధ్య ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. ‘నాకు 45 ఏళ్లు. నా భర్త ప్రోత్సాహంతో ఈ వయసులోనూ PhD, LLB చదువుతున్నా.
మ్యూజికల్‌గా అప్డేట్ అవుతున్నా. ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ సూచనతో మెడిసిన్ వాడుతున్నా. దాని డోస్ ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లా’ అని తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు