AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో నడిరోడ్డుపై విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. స్థానిక ఏజీ&ఎసీ కాలేజీ వద్ద ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్ ముగిసిన అనంతరం విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. కాలేజీ బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనతో విద్యార్థినులు, స్థానికులు భయాందోళన గురయ్యారు. ఘటనకు కారణం తెలియాల్సి ఉంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నడిరోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు
13
Mar