AP: అనంతపురం జిల్లా ఉరవకొండలోని సహాయ వ్యవసాయ సంచాలకుల (ADA) కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో కార్యాలయంలోని పలు ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కార్యాలయం పక్కన చెత్తకు నిప్పు పెట్టడం వల్లే మంటలు కార్యాలయానికి వ్యాపించాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఉరవకొండ ADAలో అగ్నిప్రమాదం
18
Mar