శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు మిథిలా స్టేడియానికి తీసుకువచ్చారు. కళ్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలికారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. దీంతో మిథిలా స్టేడియంలో ఉన్న భక్తుల్లో కోలాహలం నెలకొంది.
భద్రాద్రి: కళ్యాణ మండపానికి సీతారాములు
07
Apr