P
తిరుమల గోశాలలో వందల ఆవులు మృతి చెందాయని జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కాదని తేల్చి చెప్పింది. దురుద్దేశంతో కొందరు మృతి చెందిన గోవుల ఫొటోలను పోస్ట్ చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడింది. భక్తులు ఇలాంటివి నమ్మవద్దని కోరింది.