TG: నాగర్కర్నూల్ జిల్లాలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు.
సెలవులతో పాటు జాతర చివరి రోజు కావడంతో తరలొస్తున్నారు. దీంతో శ్రీశైలం హైవేపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సిద్ధాపూర్ క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చైత్రపౌర్ణమి సందర్భంగా ఏటా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య జాతర నిర్వహిస్తారు.