కర్ణాటకలోని హుబ్బళ్లిలో 5ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను బిహార్‌కు చెందిన రితేశ్ ఎత్తుకెళ్లి ఓ షెడ్డులో అత్యాచారం చేయబోగా చిన్నారి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు రాగా, నిందితుడు బాలిక గొంతునులిమి చంపేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు లొంగిపోవాలని అతడికి సూచించగా పారిపోబోయాడు.
దీంతో 2 రౌండ్ల కాల్పులు జరిపి ఎన్ కౌంటర్ చేశారు.