TG: ఖమ్మం(D)కు చెందిన రైతు దంపతులు రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని BRS MLA హరీశ్ రావు అన్నారు. ‘సాగు నీరు, కరెంట్ కష్టాలను ఎదుర్కొని వీరు 18 ఎకరాల కౌలు భూమిలో వరి సాగు చేశారు. పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు గడిచినా కొనలేదు. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. INC ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదని చెప్పడానికి ఈ రైతుల కన్నీటి దృశ్యమే సాక్ష్యం’ అని ట్వీట్ చేశారు.
ఈ రైతుల కన్నీటి దృశ్యమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం
16
Apr