శ్రీశైలంలో అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం

AP: శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి కుంభోత్సవం వైభవంగా జరిగింది. ఏటా చైత్ర మాసంలో సాత్విక బలి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలో 5వేల గుమ్మడి కాయలు, 5వేల టెంకాయలు, లక్షకు పైగా నిమ్మకాయలతో ఆలయ అధికారులు ఘనంగా వేడుక జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కలిగింది. అంతకుముందు అన్నం, పెసరపప్పు రాశులుగా పోసి ప్రదోషకాల పూజలు నిర్వహించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *